Minister Narayana: జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:05 AM
రాష్ట్రంలోని 163 పట్టణాలు, నగరాలలో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహ సముదాయాలను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని...
మంత్రి నారాయణ
కందుకూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 163 పట్టణాలు, నగరాలలో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహ సముదాయాలను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సోమవారం కందుకూరు మునిసిపాలిటీలో ఆయన ఆకస్మికంగా పర్యటించి, టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి 7లక్షల గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. గత ఐదేళ్లలో కనీసం 50 వేల ఇళ్లను కూడా జగన్ సర్కారు పూర్తిచేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.