Share News

సీఎస్‌ కమిటీలోకి మరో ముగ్గురు సభ్యులు

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:07 AM

ఉద్యోగుల ఆరోగ్య పథకంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సీఎస్‌ నేతృత్వంలో నియమించిన కమిటీలో మరో ముగ్గురికి స్థానం కల్పించింది

సీఎస్‌ కమిటీలోకి మరో ముగ్గురు సభ్యులు

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల ఆరోగ్య పథకంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సీఎస్‌ నేతృత్వంలో నియమించిన కమిటీలో మరో ముగ్గురికి స్థానం కల్పించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ సెక్రటరీ సౌరభ్‌ గౌర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కమిటీలోకి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.రామకృష్ణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పిఎస్ఎస్ఎన్‌పీ శాస్త్రిలకు సభ్యులుగా అవకాశం కల్పించింది.

Updated Date - Mar 24 , 2026 | 05:07 AM