‘సృష్టి’ కేసులో ముగ్గురు వైద్యులపై చర్యలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:23 AM
ఉభయ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల వ్యవహారాలతో సంబంధాలున్న ముగ్గురు వైద్యులపై అభియోగాలు నమోదు చేసి...
ఇంటర్నెట్ డెస్క్: ఉభయ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల వ్యవహారాలతో సంబంధాలున్న ముగ్గురు వైద్యులపై అభియోగాలు నమోదు చేసి, చర్యలకు ఆదేశించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో పిడియాట్రిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ విద్యుల్లత, ఆంధ్ర మెడికల్ కళాశాలలో గైనిక్ అసోసియేట్ ఫ్రొఫెసర్ డాక్టర్ పీ ఉషాదేవి, అదే కళాశాలలో ఎనస్థీషియా ప్రొఫెసర్, హెచ్‌వోడీ డాక్టర్ వాసుపల్లి రవి సీసీఎస్ 1964 నిబంధనల్లోని 20, 21 రూల్స్‌ను ఉల్లంఘించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆమేరకు వారిపై అభియోగాలను ఆరోగ్యశాఖ నమోదు చేసింది.