బెజవాడలో ఉగ్రలింకులు
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:14 AM
విజయవాడలో ఉగ్రలింకులు బయట పడ్డాయి. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘాలో ముగ్గురు యువకులు పడ్డారు. బెజవాడలోని వించిపేటకు చెందిన 21 ఏళ్ల ఇద్దరు యువకుల్ని...
అదుపులో ముగ్గురు యువకులు
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): విజయవాడలో ఉగ్రలింకులు బయట పడ్డాయి. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘాలో ముగ్గురు యువకులు పడ్డారు. బెజవాడలోని వించిపేటకు చెందిన 21 ఏళ్ల ఇద్దరు యువకుల్ని, భవానీపురంలో 20 ఏళ్ల మరో యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ యువకుల్ని రహస్యంగా ప్రశ్నించగా.. విదేశాల్లోని ఉగ్రవాద చర్యలకు ఆకర్షితులై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు అంగీకరించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉగ్రమూలాల చర్యలపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాల్లోని పోలీసులతోనూ సమాచారాన్ని పంచుకుంటున్నాయి. ఇటీవల ఏపీలో ఇటువంటి చర్యలు పెరగడంతో రాష్ట్ర సీఐ సెల్ అధికారులు నిరంతర నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో సీఐ సెల్ పోలీసులు విజయవాడలో యువకులు ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పోస్టులు పెట్టినట్లు పసిగట్టారు. సోదాలు చేపట్టి ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఏ సంస్థతో సంబంధాలున్నాయి? సోషల్ మీడియా ఖా తాల్లో ఉన్న లింకులేంటి? ప్రోత్సహిస్తున్నది ఎవరు? అనే వివరాల్ని సేకరిస్తున్నారు.