Share News

ఆ ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:01 PM

రాయలసీమలోని పశ్చిమ ప్రాంతమైన ఆదోని నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా గుర్తించొచ్చని, ఆ ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి కోరారు.

ఆ ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి

ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలోని పశ్చిమ ప్రాంతమైన ఆదోని నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా గుర్తించొచ్చని, ఆ ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదోనిలోని పర్యాటక కేంద్రాలను గుర్తించాలని పురావస్తు అధికారులను కోరినట్లు చెప్పారు. ఆదోని పట్టణ శివారులోని కొండల్లో వెలిసిన రణమడల ఆంజనేయస్వామి, రాంజల చెరువు, పెద్దతుంబలం గ్రామంలోని రామాలయాన్ని పర్యాటక కేంద్రాలుగా గుర్తించొచ్చని చెప్పారు. ఆదోనిని పరిపాలించిన రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు రణ మండల ఆంజనేయస్వామికి పూజలు చేసిన తర్వాతే విజయం సాధించేవారని చరిత్ర చెబుతోందన్నారు. అలాగే పక్కనే ఉన్న రాంజల చెరువు కూడా రాముడు తన బాణం వేయడంతో నీళ్లు వచ్చాయని, అందుకే రాంజల చెరువుగా దాన్ని గుర్తిస్తున్నారని చెప్పారు. అలాగే పెద్దతుంబళం గ్రామంలో రామాలయాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు. అక్కడ అభివృద్ధి చెందడతో పాటు చాలామందికి ఉపాధి దొరుకుతుందన్నారు. రాంజల చెరువు దగ్గర బోటు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ఒక మంత్రాలయంతో పాటు వీటిని కూడా దర్శించుకునే భాగ్యం కలుగుతుందన్నారు. ఆ విధంగా పురావస్తు శాఖ కూడా ఆలోచించి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు.

Updated Date - Jan 22 , 2026 | 11:01 PM