బాబోయ్..దొంగలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:50 PM
వరుస చోరీలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఫ వ్యవసాయ బోర్లే టార్గెట్
ఫ విలువైన కాపర్ వైర్లు చోరీ
ఫ బెంబేలెత్తిపోతున్న రైతులు
ఫ పోలీసులకు ఫిర్యాదులు
బండిఆత్మకూరు జనవరి9(ఆంధ్రజ్యో తి): వరుస చోరీలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మండలం లోని పలు గ్రామాల్లో రైతుల పొలాల వద్ద అమర్చిన మోటార్లు, ఆయిల్ ఇంజన్లు, విద్యుత కాపర్ తీగలు చోరీ అవుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి భోజనం, మాధవరం గ్రామాలకు చెందిన మళ్లేశ్వరరెడ్డి, వెంకట య్య, కమాల్, మనోహర్‌బాబు, కొత్తబోయ శంకర్, నద్దిమౌలాలి, రంగస్వామిరెడ్డి, రమ ణా రెడ్డిలతో పాటు మరి కొంత మంది రైతులకు చెందిన విద్యుత కాపర్ తీగలను దొంగలు ఎత్తుకెళ్లారు. నెల రోజుల వ్యవధి లోనే మూడుసార్లు దొంగలు తమ మో టార్ల తీగలు దొంగలించారని రైతులు వాపో యారు. అలాగే గ్రామానికి చెందిన మన్సూ ర్ అనే రైతు ఆయిల్ ఇంజన గత 20 రోజు ల క్రితం దొంగలు ఎత్తుకెళ్లారు. ఇది ఇలా ఉండగా గత 10 రోజుల క్రితం ఈర్నపాడు గ్రామానికి చెందిన విశ్వనాథ రెడ్డికి చెందిన రెండు విద్యుత మోటార్లను, సుబ్బరాయుడు, లింగమయ్య, తిరుపాల్‌తో పాటు మరి కొంత మంది రైతులకు చెందిన సుమారు 250 మీటర్ల వైర్లు కత్తెరించుకెళ్లారు. అలాగే లింగాపురం గ్రామానికి చెదిన నరసింహారెడ్డి , మరి కొంత మంది రైతుల పొలాల వద్ద ఉన్న విద్యుత తీగలను దొంగలు ఎత్తుకెళ్లార ని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రా మాపురంలో కొంతమంది రైతుల తీగలు, మరికొన్ని గ్రామాల్లో ఇలాంటి చోరీలు మం డల వ్యాప్తంగా తరచూ చోటు చేసుకుం టూనే ఉన్నాయి. దీంతో రైతులు ఆర్థిక భారంతో పాటు, నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఈ దొంగతనాలపై పోలీసులకు రైతులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు మాత్రం యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతు న్నారు. పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకుని రక్షణ కల్పించాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.