సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:48 PM
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.
- టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
- ‘పది’లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సన్మానం
ఆదోని, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. ఆదివారం పట్టణంలో గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గ ప్ర భుత్వ పాఠశాలల ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించి, స న్మానించారు. ఈ సందర్భంగా గుడిసె కృష్ణమ్మ మా ట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎన్నో ఇబ్బందులను అధిగమించి, కష్టపడి చదివి అద్భుతమైన ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని నిరూపించారని కొనియాడారు. విద్యార్థులు భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యారంగంలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకు డు ఉమాపతినాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు ల ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించేందుకు గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. సమావేశంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, నాయకులు ఉమ్మిసలీం, ఆరేకల్ రామకృష్ణ, విట్టా రమేష్, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, గోపాల్‌రెడ్డి, గుడిసె శ్రీరాములు, మధుసూదన్‌శర్మ, సోమశేఖర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు డైరెక్టర్ మనోరయ్య, మురళి, బసాపురం రామస్వామి, బుద్ధారెడ్డి పాల్గొన్నారు.