Share News

చేయి చేయి కలిపారు.. రోడ్డును బాగు చేశారు

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:51 PM

తమ గ్రామానికి రోడ్డు బాగు చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించి విసిగిపోయిన నాగరకన్వి, హొన్నూరు గ్రామస్థులు తలా ఓ చేయి వేసుకుని గుంతలమయంగా ఉన్న రోడ్డును బాగు చేసుకు న్నారు.

చేయి చేయి కలిపారు.. రోడ్డును బాగు చేశారు
నాగరకన్వి రోడ్డుకు చదును చేస్తున్న గ్రామస్థులు

హొళగుంద, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): తమ గ్రామానికి రోడ్డు బాగు చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించి విసిగిపోయిన నాగరకన్వి, హొన్నూరు గ్రామస్థులు తలా ఓ చేయి వేసుకుని గుంతలమయంగా ఉన్న రోడ్డును బాగు చేసుకు న్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ తమ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారమన్నారు. వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా పాడైందని, వాహనాల రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉండేదన్నారు. అధికారులు, పాలకులకు మొరపెట్టిన పట్టించుకోకపోవడంతో గ్రామస్థులంతా కలిసి రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు పలువురు దాతలు సహకారం అందించినట్లు వివరించారు. ప్రభుత్వం బీటీ రోడ్డు వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Apr 13 , 2026 | 11:51 PM