పాల ధర పెంచేశారు..
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:28 PM
ఎల్‌నినో ప్రభావంతో నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 20 లక్షల మందికి పైగా నిత్యం వినియోగిస్తున్న పాల ధరను గతంలోనే వివిధ పాల డెయిరీలు పెంచేశాయి.
లీటరు ప్యాకెట్‌పై రూ.2 అదనం
కర్నూలు అగ్రికల్చర్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 20 లక్షల మందికి పైగా నిత్యం వినియోగిస్తున్న పాల ధరను గతంలోనే వివిధ పాల డెయిరీలు పెంచేశాయి. తాజాగా విజయ డెయిరీ యాజమాన్యం కూడా గురువారం నుంచి పాల ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. విజయ గోల్డ్ లీటరు ప్యాకెట్ ధర రూ.72 ఇప్పటిదాకా వసూలు చేస్తుండగా.. రూ.2 అదనంగా పెంచి రూ.74లు వసూలు చేయనున్నారు. విజయ గోల్డ్ 500 ఎంఎల్ పాల ధర రూ.37 ఉండగా రూ.38లకు పెంచారు. విజయ టోన్డ మిల్క్ 500 ఎంఎల్ ధర రూ.30 ఉండగా.. రూ.31కు పెంచారు. పాల సేకరణతో పాటు ఇతర నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతోనే పాలధరను గత్యంతరం లేని పరిస్థితుల్లో పెంచేందుకు నిర్ణయం తీసుకుందని విజయ డెయిరీ ఎండీ ప్రదీప్ కుమార్ తెలిపారు.