నిర్లక్ష్యానికి గురయ్యాయి
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:10 AM
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఎ మ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి
ఎమ్మిగనూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఎ మ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిఽథిగృహం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలలో ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయకపోవటంతో రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఎమ్మిగనూరు పట్టణ ప్ర జలకు మూడు పూటల తాగునీరు అందించాలన్న లక్ష్యం తో జీడీపీ పైప్‌లైన తీసుకొచ్చామని, అలా గే టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు వందఎకరాలు భూమిని కేటాయించామని చెప్పారు.
సమన్వయంతో పనిచేయాలి
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో అన్ని రకాల వైద్యసేవలు అందేలా వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి అబివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రిలో పారిశుధ్యం, పరిశుభ్రత, రోగుల వార్డులు, ఓపీ, తాగునీటి సౌకర్యం, నవజాత శిశువు సంరక్షణ వంటి వాటిని సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెం ట్ డాక్టర్ ఆదినగేష్, డైరెక్టర్లు వాల్మీకి రామకృష్ణ, సురేష్, అంబేడ్కర్ పాల్గొన్నారు.
అలసత్వం వద్దు
ప్రజా సమస్యలను పరిష్కరించటంలో అలసత్వం ప్రదర్శించరాదని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో నిర్వహించిన ప్ర జాసమస్యల పరిష్కార వేదికలో ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలా లకు చెందిన పలువురు అర్జీలను ఎమ్మె ల్యేకు అందజేశారు. వినతులను ఎమ్మెల్యే ఆయా శాఖలకు పంపారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.