Share News

ఓటు బ్యాంకుగా చూస్తున్నారు

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:31 PM

ప్రతిపక్ష పార్టీలు మహిళలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారంటూ ఎమ్మెల్యే పార్థసారఽథి ఆవేదన వ్యక్తం చేశారు.

 ఓటు బ్యాంకుగా చూస్తున్నారు
వీవోఏలకు సెల్‌ఫోన్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

మహిళా రిజర్వేషన బిల్లును

అడ్డుకున్న పార్టీలను బొందపెడదాం

ఉద్యోగుల అవసరాలను

తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని రూరల్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ప్రతిపక్ష పార్టీలు మహిళలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారంటూ ఎమ్మెల్యే పార్థసారఽథి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక వెలుగు కార్యాలయంలో 63మంది వీవోఏలకు సెల్‌ఫోన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎగువ, దిగువ సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన బిల్లును ఏన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయన్నారు. ప్రతిపక్షాల కుతంత్రాలను తిప్పి కొట్టి తిరిగి ఎగువ, దిగువ సభల్లో మహిళా రిజర్వేషన బిల్లును ప్రవేశ పెడుతామని ధీమా వ్యక్తం చేశారు. డీఆర్‌డీఏ వెలుగు కార్యక్రమం ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మానస పుత్రిక అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ తెలిపారు. ప్రజల కోసం పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని దీవించారని రాష్ట్ర కురువ కార్పొరేషన చైర్మన దేవేంద్రప్ప తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగరాజు స్వా మి, ఏపీఎం ఈరన్న, నాయకులు పాల్గొన్నారు.

డ్వాక్రా సంఘాల బలోపేతానికి కృషి

ఆలూరు: డ్వాక్రా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కా ర్యాలయంలో వెలుగు ఏపీఎం ఆంజనేయు లు అధ్యక్షతన నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన వీఓఏలకు 5జీ మొబైల్‌ ఫోన్‌లను ఆమె పంపిణీ చేశారు. అలాగే జీవనోపాదులలో భాగంగా మహిళలకు ఆలూరు మండలంలో స్వయం ఉపాధికి సంబంధించి ఎగ్‌ కార్డును కూడా ఆమె ప్రారంభించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మీనాక్షినాయుడు, టీడీపీ కన్వీనర్‌లు శీనప్ప, పురుషోత్తం, జనసేన నాయకులు రంజిత్‌, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:31 PM