Share News

తాగి తోలుతున్నారు!

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:11 AM

బెంగళూరు నుంచి ప్రయాణికులతో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదకరంగా నడుస్తోంది. వారధి కింద ట్రాఫిక్‌ బూత వద్ద ఉన్న ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ బస్సును గమనించి డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేశారు. బస్సును ఆపి డ్రైవర్‌ను కిందికి దింపారు. బస్సును ఒక లేన్‌లో ఎందుకు నడపడం లేదని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. డ్రైవర్‌ పరిస్థితి ఎలా ఉందో నిర్ధారించడానికి బ్రీత ఎనలైజర్‌తో మత్తు పరీక్ష చేశారు. డ్రైవర్‌ రక్తంలో 36శాతం మత్తు ఉన్నట్టు నిర్ధారణయింది. అతడితో పాటు బస్సులో ఉన్న రెండో డ్రైవర్‌కు పరీక్ష చేశారు. అతడూ మద్యం మత్తులో ఉన్నట్టు తేలింది. బస్సును అక్కడే ఆపేసి మద్యం మత్తులో డ్రైవర్‌ సీట్లో కూర్చున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘటన ఇది.

తాగి తోలుతున్నారు!

డ్రెంకెన్‌ డ్రైవ్‌లో చిక్కుతున్న ‘ప్రైవేటు’ పైలెట్లు

మద్యం తాగి బస్సు ఎక్కుతున్న డ్రైవర్లు

ఇద్దరు డ్రైవర్లూ మద్యం మత్తులోనే..

ఆదాయంపైనే ట్రావెల్‌ ఏజెన్సీల దృష్టి

ప్రయాణికుల భద్రత గాల్లో దీపమే!

(ఆంధ్రజ్యోతి - విజయవాడ)

- బెంగళూరు నుంచి ప్రయాణికులతో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదకరంగా నడుస్తోంది. వారధి కింద ట్రాఫిక్‌ బూత వద్ద ఉన్న ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ బస్సును గమనించి డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేశారు. బస్సును ఆపి డ్రైవర్‌ను కిందికి దింపారు. బస్సును ఒక లేన్‌లో ఎందుకు నడపడం లేదని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. డ్రైవర్‌ పరిస్థితి ఎలా ఉందో నిర్ధారించడానికి బ్రీత ఎనలైజర్‌తో మత్తు పరీక్ష చేశారు. డ్రైవర్‌ రక్తంలో 36శాతం మత్తు ఉన్నట్టు నిర్ధారణయింది. అతడితో పాటు బస్సులో ఉన్న రెండో డ్రైవర్‌కు పరీక్ష చేశారు. అతడూ మద్యం మత్తులో ఉన్నట్టు తేలింది. బస్సును అక్కడే ఆపేసి మద్యం మత్తులో డ్రైవర్‌ సీట్లో కూర్చున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘటన ఇది.

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో డ్రైవర్లు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. బస్సు మొత్తం నిండిపోయిన తర్వాత ఎక్కడా ఆగకుండా వెళ్తుందని ప్రయాణికులు భావిస్తున్నారు. ప్రయాణికులు పూర్తిగా నిద్రలోకి జారుకున్న తర్వాత డ్రైవర్లు ‘కిక్‌’ ఎక్కించుకుంటున్నారు. మద్యం మత్తులోనే స్టీరింగ్‌ పట్టుకుంటున్నారు. కిక్‌లో ఉండటంతో నియంత్రణను కోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నారు. గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికుల ప్రాణాలకు ముప్పును తెచ్చి పెడుతున్నారు. రహదారులపై వెళ్తున్న ఇతర వాహనదారుల ప్రాణాలు తీస్తున్నారు.

ఏజెన్సీలు ఏం చేస్తున్నట్టు?

ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలు, అందులో జరుగుతున్న ప్రాణ నష్టాలతో ఏజెన్సీల పాత్రపైనా చర్చ జరుగుతోంది. వేలాది రూపాయలకు టికెట్లను విక్రయించి ఖజానాను నింపుకునే ఏజెన్సీలు ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భరోసా ఇస్తున్నాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విజయవాడ నుంచి ఇతర ప్రధాన నగరాలకు, రాషా్ట్రలకు 150 బస్సులు నిత్యం వెళ్తుంటాయి. ఇవి కాకుండా మరో 100 వరకు స్లీపర్‌ బస్సులు ఉన్నాయని అంచనా. ఈ బస్సుల్లో ఇద్దరు పైలెట్లు ఉంటారు. ఒకరికి నిద్ర వస్తే మరొకరు బస్సును నడిపేలా ఇద్దరేసి డ్రైవర్లను ప్రతి బస్సుకు కేటాయిస్తారు. ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన డ్రైవర్లు మద్యం మత్తులో తూలుతున్నారు. ఆ స్థితిలోనే బస్సులను తోలుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించే డ్రెంకెన్‌ డ్రైవ్‌ పరీక్షల్లో ప్రతి నెలలో ఇద్దరు, ముగ్గురు ట్రావెల్స్‌ బస్సుల డ్రైవర్లు మద్యం మత్తులో చిక్కుతున్నారు. కొన్ని బస్సుల్లోకి డ్రైవర్లు మద్యం తాగి విధులకు ఎక్కుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని బస్సుల్లో డ్రైవరు మార్గమధ్యలో మద్యం తాగుతున్నట్టు తేలింది. కొద్దిరోజుల క్రితం వారధి వద్ద ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బెంగళూరు నుంచి ట్రావెల్స్‌ బస్సులోని ఇద్దరు డ్రైవర్లు మద్యం మత్తులో ఉండటం గమనార్హం.

Updated Date - Apr 20 , 2026 | 01:11 AM