Share News

విద్యార్థుల కడుపు కొడుతున్నారు

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:24 PM

మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదని, ఉడికి ఉడకని అన్నంతో పాటు కూరగాయలు లేని నీళ్లచారుతో విద్యార్థుల కడుపు కొడుతున్నారని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థుల కడుపు కొడుతున్నారు
తహసీల్దార్‌, ఎంఈవోతో వాగ్వాదం చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

- ‘మధ్యాహ్న భోజనం’పై విద్యార్థుల ఆగ్రహం

- తహసీల్దార్‌ కార్యాలయం ముందు

భోజనం ప్లేట్‌లతో నిరసన

- తహసీల్దార్‌, ఎంఈవో హామీతో వెనుదిరిగిన విద్యార్థులు

హొళగుంద, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదని, ఉడికి ఉడకని అన్నంతో పాటు కూరగాయలు లేని నీళ్లచారుతో విద్యార్థుల కడుపు కొడుతున్నారని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎస్‌ఎ్‌ఫఐ మండల అధ్యక్షులు మల్లయ్య, ఉచ్చీరప్ప ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఖాళీ ప్లేట్‌లతో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వంట ఏజెన్సీ, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేసే వంట ఏజెన్సీ నిర్వాహకులు ఉడకని అన్నం, నీళ్ల చారుతో పాటు కుళ్లిన కోడి గుడ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 600 మంది విద్యార్థులు ఉంటే కేవలం 300 మందికి భోజనం ఇవ్వడం సరికాదన్నారు. నాణ్యమైన భోజనం అందించాలని, కళాశాలలోనే వంట కొత్త ఏజెన్సీకి ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వంట ఏజెన్సీ రద్దు చేసేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. తహసీల్దార్‌ లక్ష్మిరాజు, ఎంఈఓ-2 కబీర్‌సాబ్‌ విద్యార్థులతో మాట్లాడారు. త్రిమెన్‌ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. రెండు రోజుల్లో వంట ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు.

Updated Date - Aug 11 , 2026 | 11:24 PM