‘సర్’లో తప్పులు ఉండరాదు
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:50 PM
తప్పులు లేకుండా ‘సర్’ ప్రక్రియను పూర్తి చేయాలని పత్తికొండ ఆర్డీవో ఓబులేసు అధికారులను ఆదేశించారు.
మద్దికెర, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తప్పులు లేకుండా ‘సర్’ ప్రక్రియను పూర్తి చేయాలని పత్తికొండ ఆర్డీవో ఓబులేసు అధికారులను ఆదేశించారు. ఆదివారం మద్దికెర గ్రామంలోని పలు వీఽధుల్లో ఎన్యుమరేషన ఫారాలు ప్రతి ఇంటికి ఇస్తున్నారా లేదా అడిగి తెలుసుకుని వారి నుంచి పూర్తి చేసిన ఎన్యుమరేషన ఫారాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14లోగా సర్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయాలని, ఎక్కడైనా బూత లెవెల్ అధికారుల పనితీరు సరిగ్గా లేకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సర్ సర్వేలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. బీఎల్వోలు ప్రతి రోజు ఆయా వీదుల్లో పర్యటించి ప్రజల నుంచి వివరాలు సేకరించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ సర్వేను చేస్తున్నామనీ, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీఎల్వోలు మోదీన బాషా, శ్రీవాణి తదితరులు ఉన్నారు.
తుగ్గలి: ‘సర్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి ఎన్యుమరేషన ఫారాన్ని ప్రతి ఓటరుకు అందించాలని తహసీల్దార్ రవి అన్నారు. ఆదివారం మండలంలోని శభా్‌షపురం, పెండేకల్ ఆర్‌ఎస్ తదితర గ్రామాల్లో నిర్వహించిన సర్ సర్వేలో భాగంగా ప్రత్యేక శిబిరాలకు వెళ్లి ఎన్యుమరేషన ఫారాలను పరిశీలించారు. కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఈ నెల 14లోపు పూర్తి చేయాలన్నారు. బూత లెవెల్ ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో వీఆర్వోలు బూత లెవల్ ఆఫీసర్లు, టీడీపీ నాయకులు మసాల శ్రీను, బొందిమడుగుల మోహన, శ్రీరాములు తదితరులు ఉన్నారు.