అవగాహన ఉండాలి
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:50 PM
నేటి ఆధునిక కాలంలో ప్రజలు చ ట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సివిల్ కోర్టు న్యా యాధికారి ఏవీఎస్ శ్రీవల్లి సూచించారు.
- ఆదోని సివిల్ కోర్టు న్యాయాధికారి ఏవీఎస్ శ్రీవల్లి
ఆదోని, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): నేటి ఆధునిక కాలంలో ప్రజలు చ ట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సివిల్ కోర్టు న్యా యాధికారి ఏవీఎస్ శ్రీవల్లి సూచించారు. శుక్రవారం కపటి గ్రామంలో మండ ల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయాధికారి శ్రీవల్లి మాట్లాడుతూ సమాజంలో పెరిగిపోతున్న నేరాలను అరికట్టడంలో చట్టం కీలక పాత్ర పోషిస్తుంద ని తెలిపారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా మోసాలకు పా ల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా చట్టం కల్పించిన వె సులుబాటును ఉపయోగించుకోవాలని కోరారు. సదస్సులో న్యాయవాదులు బాలకృష్ణ, లోకే్‌షకుమార్ పాల్గొన్నారు.