Share News

వాము పొట్టుకు భలే డిమాండ్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 10:55 PM

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డుకు రైతులు తెచ్చిన వాము పొట్టుకు భలే డిమాండ్‌ ఉంది.

   వాము పొట్టుకు భలే డిమాండ్‌
మార్కెట్‌ యార్డులో రైతులు వేలల్లో తెచ్చిన వాము పొట్టు బస్తాలు

ఆదాయం పొందుతున్న రైతులు

కర్నూలు అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డుకు రైతులు తెచ్చిన వాము పొట్టుకు భలే డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం కర్ణాటక నుంచి ఆదోని డివిజనలోని మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాల నుంచి రోజు 100 నుంచి 500 క్వింటాళ్ల దాకా వాము అమ్మకానికి వస్తుంది. 200 క్వింటాళ్ల దాకా వాముపొట్టును రైతులు తీసుకువస్తున్నారు. శుక్రవారం రైతులు తెచ్చిన వాముతో పాటు పొట్టుకు కూడా క్వింటా రూ.12,069 ధర లభించడంతో అన్నదాతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ పొట్టును రైతులు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. సెల క్షన గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి చొరవ తీసుకుని వాము పొట్టుకు కూడా ఎంతో కొంత ధర అందించేందుకు తీసుకున్న చర్యలు రైతులకు ఆర్థికంగా ఆదుకుంటోంది. ఈ వామును తూర్పారబట్టి వామును వెలికి తీసేందుకు కర్నూలు మార్కెట్‌ యార్డులో కొంత మంది వ్యాపారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీని వల్ల సుమారు వంద మంది మహిళలకు ఉపాది దొరికినట్లయింది. మార్కెట్‌ కమిటీకి కూడా ఆదాయం చేకూరుతుంది. పొట్టును నిల్వ చేసుకునేందుకు మార్కెట్‌ యార్డులో కొంత స్థలాన్ని వ్యాపారులకు కేటాయించారు. వ్యాపారులు నెలకు 60-80వేల దాకా మార్కెట్‌ కమిటీకి చెల్లిస్తున్నారు. ఈ వాము విక్రయాల సీజన ఫిబ్రవరి నుంచి జూన వరకు కొనసాగుతుండటంతో మార్కెట్‌ కమిటీకి లక్షల్లో ఆదాయం వస్తుంది.

మార్కెట్‌ కమిటీకి ఆదాయం

కర్నూలు మార్కెట్‌ కమిటీకి వాము పొట్టుతో మంచి ఆదాయం లభిస్తోంది. రైతులకు కూడా పొట్టు నుంచి వేలల్లో ఆదాయం వస్తుంది. ఎవరైనా వ్యాపారులు వామును కానీ, బయటకు తరలించి జీరో వ్యాపారం చేయాలని చూస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తాం.

ఫ జయలక్ష్మి, సెలక్షన గ్రేడ్‌ సెక్రటరీ, కర్నూలు మార్కెట్‌ కమిటీ

Updated Date - Feb 13 , 2026 | 10:55 PM