రోడ్లు లేవు.. వసతులు కరువు
ABN , Publish Date - May 14 , 2026 | 11:45 PM
మండలంలోని కుశాలపురం పారిశ్రామిక వాడకు ఆనుకుని ఉన్న జగనన్న కాలనీలో సమస్యలు తిష్ఠవేశాయి.
ఎచ్చెర్ల, మే 14(ఆంఽధ్రజ్యోతి): మండలంలోని కుశాలపురం పారిశ్రామిక వాడకు ఆనుకుని ఉన్న జగనన్న కాలనీలో సమస్యలు తిష్ఠవేశాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కాలనీలో నివాసం ఏర్పాటుచేసు కున్న వారంతా అవసప్థలకు గురవుతున్నారు. ఇక్కడ 150 ఇళ్లు ఉన్నాయి. అయితే పూర్తిస్థాయిలో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ ఏర్పాటుచేసి నాలుగేళ్లు పూర్తవుతున్నా, ఇప్పటికీ సరైన వసతులు కల్పించకపోవడంతో అగచాట్లు తప్పడం లేదు. సరైన రోడ్లు సౌకర్యం లేక వర్షాకాలంలో కాలనీలో నీరుచేరుతుం డడంతో స్థానికులు తీ వ్ర ఇబ్బందులకు గురవుతున్నారరు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.