రోడ్లు లేవు..నీళ్లు రావు..కరెంటు ఉండదు
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:18 AM
మరణించిన తరువాతనైనా గౌరవంగా అంత్యక్రియలు జరపాలన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ చిం తపల్లి మండలంలోని చాలా గ్రామాల్లో వైకుంఠధామాల పరిస్థితి అధ్వానంగా తయారయ్యాయి. ప్రభుత్వం కోట్ల రూపాయాలు ఖర్చు చేసి నిర్మించిన వైకుంఠధామాల్లో కొన్ని చొట్ల రోడ్లు లేవు.. నీళ్లు రావు.. మరికొన్ని చొట్ల విద్యుత్ సౌకర్యం లేదు. - (ఆంధ్రజ్యోతి-చింతపల్లి)
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
మరణించిన తరువాతనైనా గౌరవంగా అంత్యక్రియలు జరపాలన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ చిం తపల్లి మండలంలోని చాలా గ్రామాల్లో వైకుంఠధామాల పరిస్థితి అధ్వానంగా తయారయ్యాయి. ప్రభుత్వం కోట్ల రూపాయాలు ఖర్చు చేసి నిర్మించిన వైకుంఠధామాల్లో కొన్ని చొట్ల రోడ్లు లేవు.. నీళ్లు రావు.. మరికొన్ని చొట్ల విద్యుత్ సౌకర్యం లేదు.
- (ఆంధ్రజ్యోతి-చింతపల్లి)
మండలంలో మొత్తం 36 గ్రామపంచాయతీలు ఉన్నా యి. ఇందులో 32 గ్రామపంచాయతీల్లో మాత్రమే వైకుంఠధామాలు ఏర్పాటు చేశారు. 2019-2021లో ఉపాధి హ మీ పథకం నిధులు ఒక్కో వైకుంఠధామం నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 నుంచి రూ. 12 లక్షల దాకా నిఽధు లు మంజూరు చేసింది. వీటిలో సుమారు 30 వైకుంఠదామాల్లో కనీస వసతులతో పాటు రోడ్డు, విద్యుత్తు, నీటి సౌకర్యాలు లేకుండానే ఉన్నాయి. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కనీస వసతి సౌకర్యాలు లేకపోవడంతో ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారుతున్నాయి. కొన్నిగ్రామాల్లో చెరువుల, కుంటల సమీపం లో నిర్మించడంతో వర్షాకాలం వచ్చిదంటే చాలు కొన్ని నీటిలో ముంపునకు గురువుతుండడంతో అంత్యక్రియలు నిర్వహించడం తలకు మించిన భారంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కొన్నిచోట్ల దారి సైతం లేదు. దీంతో రహదారి వెంట ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో, చెరువు కట్టల వెంట అంత్యక్రియలు జరపాల్సి న పరిస్థితి నెలకొందని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపైన గొడకొండ్ల గ్రామపంచాయతీలోని వేంకటేశ్వరనగర్(మాల్)కు చెందిన పలువురు యువకులు ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా గ్రామాల్లో వసతులు లేని వైకుంఠఽధామాలను గుర్తించి కనీస వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి వాటిని వినియోగంలోకి తీసుకరావడానికి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.
గొడకొండ్ల(వీ.టీ.నగర్)లో తప్పని తిప్పలు..
రెండు జిల్లాల కూడలి ప్రముఖ విద్యావ్యాపార కేం ద్రంగా అభివృద్ధి చెందిన గొడకొండ్ల గ్రామపంచాయతీలోని వెంకటేశ్వరనగర్(మాల్)లో వైకుంఠధామం గ్రా మానికి 3 కిలెమీటర్ల దూరంలో ఉంది. సర్వే నంబర్ 35 లో ప్రభుత్వ భూమి ఉండగా అందులో రూ.12 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. యాచారం మండలంలోని పాత్ మాల్ మీదుగా ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని తరలించాలి. ఈ సమస్యకు పరిష్కారం లేకపోవడంతో వీ.టీ.నగర్ వేంకటేశ్వర ఆలయానికి వెళ్లే రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన వైకుంఠథామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పాత మాల్ గ్రామవాసులు కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు.