సొంత భవనాలు లేవు..సౌకర్యాలు కల్పించలేదు
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:10 AM
మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. దీనికితోడు సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించకపోవడంతో బాలలు, నిర్వాహ కులు అవస్థలకు గురవుతున్నారు. ప్రధానంగా మ రుగుదొడ్లతోపాటు తాగునీటిసదుపాయం కల్పించ కపోవడంతో బాలలు అవస్థలకు గురవుతున్నా రు. శిథిలావస్థకు చేరిన గదుల్లో నిర్వహిస్తున్నారు.
జలుమూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. దీనికితోడు సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించకపోవడంతో బాలలు, నిర్వాహ కులు అవస్థలకు గురవుతున్నారు. ప్రధానంగా మ రుగుదొడ్లతోపాటు తాగునీటిసదుపాయం కల్పించ కపోవడంతో బాలలు అవస్థలకు గురవుతున్నా రు. శిథిలావస్థకు చేరిన గదుల్లో నిర్వహిస్తున్నారు.
మండలంలో 95 అంగనవాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో 25 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా మరో 30 కేంద్రాలు పాఠశాలల భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగతా 40 కేంద్రాలు అద్దె, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నిర్వహిస్తున్నారు. హరికృష్ణమ్మపేట, మట్టవానిపేట, గుగ్గిలి, రామయ్యవలస, తదితర అంగనవాడీ కేంద్రాలు భవనాలు పెచ్చులూడుతున్నాయి. దీంతో ఏ సమయంలో పిల్లలపై పడి ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనన్న భయాందోళనలో అంగనవాడీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లోకి పిల్లలకు పంపించడానికి తల్లిదండ్రులు భయాందోళన చెందుతు న్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం లేక పిల్లలను పంపిస్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. శిథిలావస్థకు చేరిన గదుల్లో నిర్వ హిస్తుండడంతో శ్లాబు పెచ్చులూడి ఏ సమయాన ఎవరిపై పడి ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనన్న భయాందోళన నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు శిథిలావస్థకు చేరిన భవనాల నుంచి పిల్లలను పక్కా భవనాల్లోకి మార్చాలని పలువురు కోరుతున్నారు.