జల్సాల కోసం చోరీలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 10:41 PM
జల్సాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు చోరీలకు పాల్పడుతున్నాడు. నంద్యాల పోలీసులు చాకచక్యంగా శుక్రవారం అతడిని అరెస్టు చేసి బంగారు, వెండి ఆభరణాలు రికవరీ చేశారు.
చాకచక్యంగా దొంగను అరెస్టు చేసిన పోలీసులు
98 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి స్వాధీనం
నంద్యాల క్రైం, ఏప్రిల్ 03 (ఆంధ్రజ్యోతి): జల్సాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు చోరీలకు పాల్పడుతున్నాడు. నంద్యాల పోలీసులు చాకచక్యంగా శుక్రవారం అతడిని అరెస్టు చేసి బంగారు, వెండి ఆభరణాలు రికవరీ చేశారు. వివరాలను జిల్లా పోలీసు కార్యాల యంలో ఎస్పీ సునీల్ షెరాన శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
సీసీఎస్, రూరల్ ఇనస్పెక్టర్లు సురేష్‌కుమార్, ఈశ్వరయ్యల నేతృ త్వంలో నంద్యాల పట్టణ సమీపంలోని న ందమూరినగర్ నాగులకట్ట వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. వెహికల్స్ చెకింగ్ చేస్తున్న పోలీసు లను చూసిన షేక్ బాబావలి (25) పారిపోయేందుకు యత్నించాడు. మోటర్‌సైకిల్ (పల్సర్)కు నంబరు ప్లేటు కూడా లేకుండా బైక్ తిప్పుకుని వెళ్తున్న అతడిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసు కున్నారు. పోలీసుల విచారణలో దొంగగా తేలింది. నంద్యాల మం డలం వైఎస్‌ఆర్ నగర్‌కు చెందిన షేక్ కరీముల్లా కుమారుడు షేక్ బాబావలి జల్సాలకు అలవాటు పడి పలు పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడతున్నాడు. నంద్యాల తాలూకా, బండి ఆత్మకూరు, గడివేముల, బేతంచెర్ల, సంజామల, అవుకు పోలీసు స్టేష న్ల పరిధిలో జరిగిన చోరీ కేసుల కు సంబంధించి దాదాపు రూ.15లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు రూ.54, 500 నగదును స్వాధీనం చేసుకున్నారు. బాబావలిని చాకచక్యంగా అరెస్టు చేసిన ఇనస్పెక్టర్లు సురేష్‌కుమార్, ఈశ్వరయ్య, తాలూకా పోలీసుస్టేషన సిబ్బందిని ఎస్పీ సునీల్ షెరాన, అడిషనల్ ఎస్పీ ఎం.జావళి అల్ఫోన్స పత్యేకంగా అభినందించారు.