కోవెలకుంట్లలో చోరీ
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:23 PM
పట్టణంలోని బనగానపల్లె రోడ్డులో ఉన్న జయరామిరెడ్డి ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి శనివారం తెలిపారు.
వెండి, బంగారం, వస్తువుల అపహరణ
కోవెలకుంట్ల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బనగానపల్లె రోడ్డులో ఉన్న జయరామిరెడ్డి ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి శనివారం తెలిపారు. వివరాలు.. పట్టణానికి చెందిన జయరామిరెడ్డి ఈనెల 5న రాత్రి తన ఇంటికి తాళాలు వేసి బెంగళూరులో ఉన్న కొడుకు వద్దకు వెళ్లారు. 10వ తేదీ ఉదయం బెంగళూరు నుంచి తిరిగి వచ్చి ఇంటికి వెళ్లగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాను పగులగొట్టి అందులో ఉన్న 29 తులాల వెండి, 14 గ్రాముల బంగారు, ఇతరు వస్తువులు అపహరించుకెళ్లారు. దొంగతనాన్ని ఛేదించేందుకు క్లూస్ టీమ్‌ను పిలిపించి, తనిఖీలు నిర్వహించారు. బాధితుడు జయరామి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.