హోటల్‌లో చోరీ
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:40 PM
ఆదోని మండలం-1 పరిధిలోని ఆరేకల్ శివారులోని ఓ టీ కొట్టులో శనివారం పట్టపగలు చోరీ జరిగింది.
ఆదోని రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆదోని మండలం-1 పరిధిలోని ఆరేకల్ శివారులోని ఓ టీ కొట్టులో శనివారం పట్టపగలు చోరీ జరిగింది. తాలుకా ఎస్‌ఐ రామాంజనేయులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల చంద్రశేఖర్ శివారులో ఒక కంటైనర్‌లో టీ కొట్టు నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన గంగిరెడ్డి పక్కనే పొలంలో వ్యవసాయం చేస్తూ, గ్రామంలో ఇంటి నిర్మాణం చేపట్టా డు. ఇంటికి సంబంధించిన సామాగ్రి కొనుగోలు కోసం రూ.6లక్షలు తీసుకొని హైదారాబాదు వెళ్లానని గొల్ల చంద్రశేఖర్ వద్దకు వచ్చాడు. అయితే, ఇంటి వద్ద చిన్న పని ఉందని ఈ నగదును నీ వద్ద ఉంచు కోవాలని, హోటల్ నిర్వాహకుడు చంద్రశేఖర్‌కు ఇచ్చి వెళ్లాడు. సదరు హోటల్ నిర్వాహకుడు డబ్బుల పెట్టేలో నగదును ఉంచి లోపలకు వెళ్లాడు. టీ తాగడానికి వచ్చిన ఓ వ్యక్తి గమనించి నగదును తీసు కొని పరారయ్యాడు. ఆ నగదును ఎత్తుకెళ్లిన వ్యక్తి త రచూ వచ్చే వ్యక్తిగా గుర్తించారు. త్వరలో పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.