యువత అవకాశాలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:54 PM
జాబ్‌మేళా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
పత్తికొండ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జాబ్‌మేళా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ సంతోష్, డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాధురి ఆధ్వర్యంలో పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాబ్‌మేళా నిర్వహించారు. ముఖ్యఅతిఽఽఽథిగా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు హాజరయ్యారు. పత్తికొండ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు వృత్తినైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐదుసార్లు జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. 12కంపెనీల్లో ఉద్యోగావకాశాల కోసం ఏర్పాటు చేసిన జాబ్‌మేళాలో 113మంది రిజిస్ర్టేషన చేసుకోని ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, ఇందులో 43మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మాధురి తెలిపారు. అంతకు ముందు తెలుగుబాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి నివాళి అర్పించారు. అలాగే టీడీపీ నాయకుడు శ్రీకాంతచౌదరి ఆర్చిరీ కిట్‌ను అందజేయగా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రిన్సిపాల్‌కు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కోఆర్డినేటర్ ఎనవీ శివకుమార్, ఎనసీసీ క్యాడెట్స్ అధికారి పి సూర్యచంద్ర, మునగాల శివరామక్రిష్ణ, అర్బన సీఐ జయన్న, టీడీపీ నాయకులు హోటల్‌శ్రీనివాసులు, వెంకటపతి, బత్తినలోక్‌నాథ్ తదితరులు ఉన్నారు.