లాబేసు వంతెన పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:57 PM
పూర్ణపాడు- లాబేసు వంతెన పనులు పూర్తి చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కొల్లి సాంబమూర్తి కోరా రు.
కొమరాడ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): పూర్ణపాడు- లాబేసు వంతెన పనులు పూర్తి చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కొల్లి సాంబమూర్తి కోరా రు. ఆదివారం లాబేసు వద్ద నాగావళి నదిలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 2006లో ప్రారంభమైన వం తెన పనులు పూర్తికాకపోవడంతో తొమ్మిది పంచాయతీల ప్రజలు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని తెలిపారు.రెండునెలల్లో వంతెన పనులు ప్రారంభించక పోతే ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.