Share News

పేదల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:20 AM

గ్రామీణ ప్రాంతాల పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

పేదల సంక్షేమమే ధ్యేయం

నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య

ఎం. ఘణపురంలో పింఛన్ల పంపిణీ

పగిడ్యాల, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను శనివారం మండలంలోని ఎం. ఘణపురం గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 1న సెలవు రోజు కావడంతో పింఛనదారులు ఎ దురుచూడాల్సిన పరిస్థితి లేకుండా ప్రభు త్వం ముందురోజే పింఛన్లను పంపిణీ చే యడం హర్షనీయమన్నారు. గ్రామాల్లో అర్హులు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకుంటే లబ్ధిచేకూరేందుకు కూటమి ప్ర భుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అనంతరం తూర్పు ప్రాతకోట గ్రామానికి చెందిన లక్ష్మీదేవికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మం జూరైన ఎల్‌వోసీని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమిత్రమ్మ, ఏఈవో సు భాన, నాయకులు రమణ, మహేశ్వరరెడ్డి, చంద్రేష్‌, శ్రీనివాసులునాయుడు, నాగశేషయ్య, వెంకటేశ్వర్లు, శంకర్‌, మద్దిలేటి గౌడ్‌, అయ్యన్న తదితరులున్నారు.

Updated Date - Feb 01 , 2026 | 12:20 AM