Share News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:24 PM

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర మైనార్టీసెల్‌ ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా తెలిపారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

చాగలమర్రి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర మైనార్టీసెల్‌ ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా తెలిపారు. శనివారం సాయంత్రం చాగలమర్రి గ్రామంలోని గోపాయపల్లె రహదారిలో రైతులు రఫి నిర్మించుకున్న మినీ గోకులం షెడ్డును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మినీ గోకులంతో రైతులకు లాభాదాయకం అన్నారు. పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రైతులు పాడి పరిశ్రమ ద్వార ఆర్థిక అభివృద్ధి చెందేందుకు వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మౌలాలి, రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ అజిమ్‌, టీడీపీ నాయకులు జెట్టి నాగరాజు, నాగూర్‌వలి, టైలర్‌ ఖాదర్‌, మహమ్మద్‌గౌస్‌, బారిక్‌చామల్‌, రాజేష్‌, అమీర్‌బాష తదితరులు పాల్గొన్నారు.

రైతు ప్రభుత్వం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని టీఎనటీయూసీ ప్రధాన కార్యదర్శి గుత్తి నరసింహులు తెలిపారు. చాగలమర్రి గ్రామంలోని మూడవ రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు యూరియా బస్తాలను అందజేశారు. ఏవో రంగనేతాజీ మాట్లాడుతూ 192 టన్నుల యూరియా మంజూరైందని అన్నారు. పెద్దబోదనం, చాగలమర్రి, శెట్టివీడు, ముత్యాలపాడు, డి.వనిపెంట, గొడిగనూరు, మల్లేవేముల గ్రామాలకు చెందిన రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవోలు మంజుల, రేవతి, వీఏఏలు సుబ్బరాయుడు, దివ్య, రైతలు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 11:24 PM