Share News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:38 PM

రైతుల సంక్షేమమే కూటమి ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

  రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తుమ్మలూరులో పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

పాసుపుస్తకాలు పంపిణీ

పాములపాడు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే కూటమి ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. శనివారం మండలంలోన తుమ్మలూరు గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన మాభూమి, మాహక్కు నూతన పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరి చేసి నూతనంగా పాసు పుస్తకాలను అందజేస్తున్నామన్నారు. రైతుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. అనంతరం గ్రామంలో గోకులం షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెల్లె హరినాథరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఏసేపు, అలీబాషా, వనమాల ప్రసాద్‌, రామకృష్ణ, పూసలక్రిష్ణ, సన్ని, సత్యంరెడ్డి, శివరామయ్య, మండల అధికారులు పాల్గొన్నారు.

కొత్తపల్లి: నాడు రైతుల పాసు పుస్తకంపై నాటి సీఎం జగన ఫొటోతో కూడిన పాసు పుస్తకాలను ఇస్తే.. నేడు కూటమి ప్రభుత్వంలో రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను రైతులకు అందజేస్తున్నట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు. నందికుంట గ్రామ సచివాలయ ఆవరణంలో తహసీల్దారు ఉమారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎమ్మెల్యే, ఆర్డీవో నాగజ్యోతి పలువురి రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదులు రావడంతో డీపీవోకు ఫోన చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోకవరం గ్రామంలో ఎనఆర్‌ఈజీఎ్‌స కింద రైతు చంద్రారెడ్డి నిర్మించుకున్న గోకులం షెడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ లింగస్వామి గౌడు, క్లస్టర్‌ ఇనచార్జి నారపురెడ్డి, నా యకులు , అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గోకవరం ప్రభుత్వ పాఠశాలకు జి.పుల్లారెడ్డి విరాళంగా ఇచ్చిన భూమిని ఆనలైన చేయాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి తహసీల్దార్‌ ఉమారాణిని ఆదేశించారు. పాఠశాల హెచఎం సుబ్బరాయుడు, ఉపాధ్యాయులు వెంకటస్వామి, వెంకటాద్రి, రసూల్‌ ఖాన ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన ఆయన క్షేత్రస్థాయిలో పత్రాలను పరిశీలించి తక్షణమే ఆనలైన చేయాలన్నారు.

మహానంది: భూ హక్కు భద్రతకు కొత్త పాసుపుస్తకాలు కీలకమని కేసీ కెనాల్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షుడు బన్నూరి రామలింగారెడ్డి అన్నారు. శనివారం మసీదుపురం గ్రామం లో టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జి నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి అధ్యక్షతన రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త పాసు పుస్తకాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీటీ తహసీల్దార్‌ కామేశ్వరరెడ్డి, వీఆర్వో నరసింహ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల రూరల్‌ : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని నంద్యాల రూరల్‌ తహసీల్దార్‌ శ్రీవాణి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని చాపిరేవుల గ్రామంలో పట్టాదార్‌ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ రామచంద్రరావు, ఆర్‌ఐ మాధవిరెడ్డి, వీఆర్వో బాలన్న పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 11:38 PM