Share News

దళితుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - May 20 , 2026 | 12:03 AM

ద ళితుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చే స్తుందని టీడీపీ ఆ లూరు ఇన్‌చార్జి వై కుంఠం జ్యోతి అన్నా రు.

 దళితుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సదస్సులో మాట్లాడుతున్న వైకుంఠం జ్యోతి

టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి

ఆలూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): ద ళితుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చే స్తుందని టీడీపీ ఆ లూరు ఇన్‌చార్జి వై కుంఠం జ్యోతి అన్నా రు. మంగళవారం పట్టణంలోని ఇందిరానగర్‌ మారెమ్మవ్వ ఆలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ దళితులపై దాడులు, హత్యలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంద న్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేట్‌ పదవులు కేటాయించారన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గా లు అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ బిల్లేకల్‌ వెంకటేష్‌, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నరసప్ప, రాజశేఖర్‌, టీడీపీ మండల కన్వీనర్‌ శీనప్ప, కార్యదర్శి కొమ్ము రాజు, నాయకులు మసాల జగన్‌, ఉలిగప్ప, బి.రాజు పాల్గొన్నారు .

Updated Date - May 20 , 2026 | 12:03 AM