Share News

ఓటర్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:14 AM

క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలను పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకుని యూనిట్‌ సభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను విజయవంతం చేయాలని టీడీపీ సీనియర్‌ నాయకులు ఉమాపతినాయుడు సూచించారు.

ఓటర్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఉమాపతినాయుడు

టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉమాపతినాయుడు

ఆదోని, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలను పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకుని యూనిట్‌ సభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను విజయవంతం చేయాలని టీడీపీ సీనియర్‌ నాయకులు ఉమాపతినాయుడు సూచించారు. ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మీనాక్షినాయుడు సూచనల మేరకు బుధవారం టీడీపీ కార్యాలయంలో పార్టీ యూనిట్‌ సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో నియోజకవర్గవ్యాప్తంగా చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చించారు. ఓటర్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఓటరు వివరాలు సరైన విధంగా నమోదు కావాలని, ఎక్కడా ఎటువంటి తప్పులు దొర్లకుండా పక్కాగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటరు నమోదు వెరిఫికేషన్‌ ప్రక్రియ అత్యంత కీలకమైనదన్నారు. ప్రతిఒక్క కార్యకర్త బాధ్యతగా తీసుకుని పని చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ జిందే శారదాభాయ్‌, ప్రముఖ నాయకులు రంగన్న, మాజీ కౌన్సిలర్లు బాలాజీ, జిందే శంకర్‌, అంజి, గిడ్డయ్య, మల్లికార్జున, సిద్ధ, జీవన్‌, శివ, కేశప్ప, సోము పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 12:14 AM