నేడు పల్లె తీర్పు
ABN , Publish Date - Nov 26 , 2026 | 01:19 AM
పల్లెసీమల భవిషత్తు తీర్చిదిద్దే పాలకులను ఎన్నుకునే ఎన్నికలు ఇవి. గ్రామాల అభివృద్ధికి బాటలు వేసే నాయకుడు కావాలా..? ప్రగతి, ప్రజల అభ్యునతి కోసం పాటుపడే ప్రజాప్రతినిధి కావాలా..? ఈ ప్రశ్నలకు సమాధానం మీ ఓటే. మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపన జరగాలంటే మంచి పాలకులు రావాలి.
ఫ తొలి విడతలో 148 పంచాయతీలకు ఎన్నికలు
ఫ పోటీలో 135 సర్పంచ స్థానాలకు 432 మంది, 1,005 వార్డులకు 2,339 మంది
ఫ ఒంటి గంట వరకు పోలింగ్, ఆపై ఫలితాలు
ఫ పోలింగ్ కేంద్రాలకు చేరిన ఎన్నిక సామగ్రి, సిబ్బంది
ఫ పంపిణీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ సిరి
కర్నూలు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పల్లెసీమల భవిషత్తు తీర్చిదిద్దే పాలకులను ఎన్నుకునే ఎన్నికలు ఇవి. గ్రామాల అభివృద్ధికి బాటలు వేసే నాయకుడు కావాలా..? ప్రగతి, ప్రజల అభ్యునతి కోసం పాటుపడే ప్రజాప్రతినిధి కావాలా..? ఈ ప్రశ్నలకు సమాధానం మీ ఓటే. మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపన జరగాలంటే మంచి పాలకులు రావాలి. అది సాకారం కావాలంటే ప్రలోభాలకు లోను కాకుండా ఓటర్లు తీర్పు ఇవ్వాలి. జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే 135 పంచాయతీ సర్పంచ స్థానాలు, 1,005 వార్డు స్థానాలకు గురువారం పోలింగ్... వెంటనే ఫలితాలు రానున్నాయి. పోలింగ్ నిర్వహణ పకడ్బందీగా జరిగేలా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సిరి పర్యవేక్షణ చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు.
జిల్లాలో 484 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలో 5,100 వార్డులు ఉన్నాయి. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన షెడ్యూల్ జారీ చేసింది. అందులో భాగంగా తొలి విడతలో ఆదోని, పత్తికొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆదోని-1, ఆదోని-2, ఆలూరు, హోళగుంద, చిప్పగిరి, ఆస్పరి, దేవనకొండ, హాలహర్వి మండలాల్లో 148 గ్రామ పంచాయతీ సర్పంచ స్థానాలు, 1,520 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 15న నుంచి నామినేషన్లు స్వీకరించారు. 22న వితడ్రా గడువు ముగిసిన తరువాత బరిలో నిలబడిన అభ్యర్థుల జాబితా అధికారులు ప్రకటించారు. ఇప్పటికే 14 పంచాయతీల సర్పంచ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఈ క్రమంలో ఎన్నికలు జరిగే 135 సర్పంచ స్థానాలకు 432 మంది బరిలో నిలిచారు. అదేవిధంగా 1,520 వార్డులకు గానూ 501 వార్డులు ఏకగ్రీవం కావడంతో 1,005 వార్డు స్థానాలకు 2,339 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎనిమిది మండలాల్లో సం‘గ్రామం’లో 3,53,724 మంది ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు.
ఫ పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది
తొలి విడత పోలింగ్ జరిగే 134 సర్పంచ స్థానాలు, 1005 వార్డులకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం 1,430 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం 1,716 మంది పీఓలు, 2,872 మంది ఓపీవోలు, 160 మంది మైక్రో అబ్జర్వర్లు (ఎంవో)లను నియమించారు. బుధవారం ఆయా మండల కేంద్రాల్లో ఎంపీడీవోల పర్యవేక్షణలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. సామగ్రితో సిబ్బంది సాయంత్రం 5-6 గంటలకే తమకు కేటాయించిన గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సిరి ఆదోని, ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిసెప్షన సెంటర్లను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు అధిక సంఖ్యలో చేరుకున్నా, ఓట్ల లెక్కింపునకు అవసరమైన రిజర్వుడు సిబ్బందిని తక్షణమే అక్కడి పంపించేలా చొరవ తీసుకోవాలని సూచించారు.
ఫ సమస్యాత్మక గ్రామాల్లో భారీ బందోబస్తు
ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికలు జరిగే ఎనిమిది మండల్లాల్లో 276 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అందులో 71 కేంద్రాలు సమస్యాత్మక, 69 కేంద్రాలు అత్యంత సమస్యాత్మక, 136 సాధారణ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో ఎస్పీ విక్రాంత పాటిల్ పర్యవేక్షణలో భారీ బందోబస్తుతో పాటు అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.