Share News

కట్టుకున్నవాడే కాలయముడై..

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:26 AM

గత నెల 31న కనిమెరక గ్రామంలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త బుంగ రామముత్యాలును అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. గ

కట్టుకున్నవాడే కాలయముడై..

బొండపల్లి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గత నెల 31న కనిమెరక గ్రామంలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త బుంగ రామముత్యాలును అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. గజపతినగరం సీఐ సామంతుల సన్యాసినాయుడు కథనం మేరకు వివరాలివీ... బుంగ రామముత్యాలు అదే గ్రామానికి చెందిన సంధ్య ఎనిమిదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇద్దరి మధ్య తగాదాలు జరుగుతున్నాయి. నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను డ అత్తమామలను డబ్బుల కోసం ముత్యాలు వేధిస్తున్నాడు. గత నెల 31న రాత్రి పది గంటల సమయంలో ఇంటికి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. మాటమాటా పెరగడంతో రామముత్యాలు భార్య సంధ్యను ముక్కును మూసి... గోడకు బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తరువాత సహజ మరణంగా చిత్రించే ప్రయత్నం చేశాడు. మృతురాలి తల్లి ఈశ్వరమ్మ తన కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అల్లుడే హత్యచేసి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమా ర్టం నివేదికలోనూ తలను బలంగా గుద్దడంతో మెదడులో రక్తం గడ్డకట్టి మృతిచెందినట్టు తేలింది. దీనవల్ల సంధ్య మృతిచెందినట్లు తేలింది. మృతురాలి ఇంటి పరిసర ప్రాంతాలలో డాగ్‌ స్క్వాడ్‌తో పాటు క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. హత్యచేసిన తరువాత రక్తపు మరకలతో ఉన్న షర్టు, నైటీ బీరువాలో ఉన్నట్లుగా గుర్తించారు. ఈమేరకు బుధవారం సాయంత్రం బొండపల్లి సమీపంలో నిందితుడిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.

Updated Date - Sep 04 , 2026 | 12:26 AM