‘సర్’ ప్రక్రియను పొడిగించాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:25 AM
భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను మరో మూడు నెలలపాటు పొడిగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య డిమాండ్ చేశారు.
పత్తికొండ టౌన్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను మరో మూడు నెలలపాటు పొడిగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సీ ఆర్ భవన్ నుంచి సీపీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవో ఓబులేసుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గిడ్డయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యమైన భారతదేశం లో రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటుహక్కును కల్పించిందన్నారు. ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు అవకాశాన్ని పొడిగించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నభిరసూల్, కృష్ణయ్య, మండల కార్యదర్శులు కారుమంచి, సుల్తాన్, పట్టణ కా ర్యదర్శి రామాంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు సురేం ద్రకుమార్, వీరన్న, నెట్టెకంటయ్య, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.