Share News

వైసీపీ హయాంలోనే రాష్ట్రం వెనుకబాటు

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:13 PM

వైసీపీ ప్రభుత్వం 2019లో అఽధికారంలోకి వచ్చాక పారిశ్రాకంగా రాష్ట్రం వెనుక బడి పోయిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

   వైసీపీ హయాంలోనే రాష్ట్రం వెనుకబాటు
అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్‌

అసెంబ్లీలో మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం 2019లో అఽధికారంలోకి వచ్చాక పారిశ్రాకంగా రాష్ట్రం వెనుక బడి పోయిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విధానంతోనే రాష్ట్రం నుంచి 913 కంపెనీలు వెళ్లి పోయాయన్నారు. గుజరాత్‌ , కర్ణాటక, మహరాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఏడాదికేడాది పరిశ్రమలు పెరుగుతూ వచ్చాయన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలో నమ్మకం పెంపొం దించేందుకు కృషిచేశామన్నారు. రాష్ట్రానికి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకో చ్చినట్లు తెలిపారు. ఫోర్సు మ్యాగజైన్‌ ప్రకటించిన రిపోర్టులో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని రాసిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుంది అనేందుకు ఇదే నిదర్శనమన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 11:13 PM