Share News

రమణీయం ఉచ్చు వీరప్పతాత రథోత్సవం

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:12 AM

మండల పరిధిలోని పెద్దహోతూరు గ్రామంలో వెలిసిన ఉచ్చువీరప్పతాత, చలువప్పతాల రథోత్సవం భక్తిశ్రద్ధలతో రమణీయంగా సాగింది.

 రమణీయం ఉచ్చు వీరప్పతాత రథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న జనం

ఆలూరు రూరల్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పెద్దహోతూరు గ్రామంలో వెలిసిన ఉచ్చువీరప్పతాత, చలువప్పతాల రథోత్సవం భక్తిశ్రద్ధలతో రమణీయంగా సాగింది. గురువారం ఉదయం ఉచ్చు వీరప్పతాత దేవాలయంలో ప్రత్యేక పూజలు అర్చకులు సిద్ధయ్యస్వామి, చంద్రమౌళిస్వామి చేశారు. రథోత్సవం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. సాయంత్రం మరకట్టు గ్రామంలో వెలిసిన చలువప్పతాతను పల్లకిలో ఊరేగింపుగా పెద్దహోతూరు ఉచ్చువీరప్పతాత దేవాలయానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు వేలాది మంది భక్తుల నడుమ అన్నదమ్ములైన చలువప్పతాత, ఉచ్చువీరప్పతాతల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథోత్సవం తిలకించేందుకు ఆంధ్ర, కర్ణాటక భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐలు మన్మఽథవిజయ్‌, ఈశ్వరరావు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు మునెమ్మ, బి.యల్లప్ప, ఎంపీటీసీలు చిన్నయాదవ్‌, దేవరాజు, లక్ష్మన్న, జయప్రకాష్‌, వెంకటేశ్వర్లు, రవి, జె.ఎల్లప్ప, పాలాక్షిరెడ్డి, కేకేడీ, చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మంగమాంబదేవి రథోత్సవం

మండలంలోని కమ్మరచేడు, కరిడిగుడ్డం గ్రామాల్లో వెలిసిన మహాయోగి మంగమాంబదేవి రథోత్సవం గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి గంగిపూజ, కుంకుమార్చన, పంచామృతాభిషేకం తదితర విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం భక్తుల జైజై ధ్వనుల మధ్య రథ చక్రాలు ముందుకు కదిలాయి. కార్యక్రమంలో సర్పంచులు సుధాకర్‌రెడ్డి, సుమతిరెడ్డి, అనిల్‌రెడ్డి, టీడీపీ రైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:12 AM