కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరాలయం
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:20 PM
ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణాపూర్, జూరాల ప్రాజెక్టులు నిండి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో సంగమేశ్వర ఆలయం పూర్తిగా జలాధివాసమైంది.
శ్రీశైలానికి భారీగా కొనసాగుతున్న వరద
జూరాల నుంచి 2,44,998 క్యూసెక్కులు విడుదల
కొత్తపల్లి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణాపూర్, జూరాల ప్రాజెక్టులు నిండి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో సంగమేశ్వర ఆలయం పూర్తిగా జలాధివాసమైంది. మరలా 8 నెలల తర్వాతనే సంగమేశ్వర దర్శనం కలుగుతుంది. ఈ ఏడాది మార్చి 22న నీట నుంచి బయల్బడిన సంగమేశ్వరాలయం 131 రోజులు భక్తులచే పూజలందుకుని నేడు నదీ గర్భంలో నిక్షిప్తమైంది. చివరిసారిగా భక్తులు ఎగువ ఉమామహేశ్వరం ఒడ్డున నదీ జలాలకు పూజలు చేసి జల హారతులు ఇచ్చారు.