పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:04 AM
పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన రాష్ట్ర సభ్యుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎంఎల్) లిబరేషన రాష్ట్ర సభ్యుడు వెంకటేశ్వర్లు
నందికొట్కూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన రాష్ట్ర సభ్యుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణంలో 29 వార్డుల్లో దాదాపు 60 వేల మంది జనాభా నివసిస్తున్నారన్నారు. పేరుకే మున్సిపాల్టీ కాని దాదాపు 70శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ప్రజలపై పన్నుల భారం పెరుగుతుందే తప్పా.. ఆశించిన స్థాయిలో పట్టణాభివృద్ధి జరగడం లేదన్నారు. పట్టణంలో కలుషిత తాగునీరు సరఫరా అవుతుందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. 29 వార్డులో డ్రైనేజీలను విస్తరించాలని, మురుగునిల్వ కుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కమిషనర్‌కు అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్)లిబరేషన నాయకులు చెరకుచర్ల గాబ్రియల్, స్వామన్న, వేల్పుల ఏసన్న, లింగాన్న శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.