వైస్ చైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించాలి
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:15 AM
ఆదోని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికే కేటాయించాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు
మీనాక్షినాయుడికి వినతి పత్రం అందజేత
ఆదోని, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆదోని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికే కేటాయించాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆదోని నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి మీనాక్షినాయుడుకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి బండారి హనుమంతు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య మాదిగ మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా ఎస్సీ సామాజికవర్గం మొత్తం ఐక్యంగా ఉంటూ టీడీపీ విజయానికి కష్టపడి పని చేస్తోందన్నారు. అయితే ఇప్పటివరకు పార్టీలో ఎమ్మెల్సీ, మార్కెట్‌యార్డు చైర్మన్ వంటి కీలకమైన నామినేటెడ్ పదవులు ఎస్సీలకు దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారైనా సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కొంక మీనాక్షినాయుడు స్పందిస్తూ.. పదవుల కేటాయింపు అంశం తన చేతుల్లో లేదని, మంత్రి నారా లోకేశ నిర్ణయం మేరకే ఖరారవుతుందని సమాధానమిచ్చినట్లు నాయకులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ తమకు ఎంతో న్యాయం చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కూడా న్యాయం చేస్తారని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పన్నెల మణికంఠ మాదిగ, జి.ఎ్‌స.దత్తు మాదిగ, సంధిపోగు బలరామ్ మాదిగ, కాటిపోగుల ఈశ్వర్ మాదిగ, బండారి నాగరాజు మాదిగ, మడ్రి కిరణ్ మాదిగ, గణేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.