కేంద్రం విధానంతో పేదలు పనిహక్కును కోల్పోతారు
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:26 PM
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ద్వారా పేదలు పని హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని డీసీసీ అధ్యక్షుడు గార్లపాటి మద్దిలేటి ఆరోపించారు.
డీసీసీ అధ్యక్షుడు గార్లపాటి మద్దిలేటి
డోన రూరల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ద్వారా పేదలు పని హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని డీసీసీ అధ్యక్షుడు గార్లపాటి మద్దిలేటి ఆరోపించారు. శనివారం కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకువచ్చిన నల్లచట్టం ద్వారా పేదలు పని హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తున్న ఉపాధి చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలన్నారు. సమావేశంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు జనార్దన, పార్టీ నాయకులు వడ్డె రాజశేఖర్, గోపినాథరావు, మధన రెడ్డి, పటాన హుశేన, నాగన్న, గిడ్డయ్య, లక్ష్మిదేవి పాల్గొన్నారు.