Share News

కార్యకర్తలు ఐక్యతగా పని చేస్తేనే పార్టీ బలోపేతం

ABN , Publish Date - May 02 , 2026 | 10:59 PM

పార్టీ బలోపేతానికి నాయకులు, కా ర్యకర్తలు ఐకమత్యంగా ఉండి పని చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన తుగ్గలి నాగేంద్ర అన్నారు.

 కార్యకర్తలు ఐక్యతగా పని చేస్తేనే పార్టీ బలోపేతం
మాట్లాడుతున్న తుగ్గలి నాగేంద్ర

ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన తుగ్గలి నాగేంద్ర

తుగ్గలి, మే 2 (ఆంధ్రజ్యోతి): పార్టీ బలోపేతానికి నాయకులు, కా ర్యకర్తలు ఐకమత్యంగా ఉండి పని చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన తుగ్గలి నాగేంద్ర అన్నారు. శనివారం మండల కేంద్రంలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశలు తనపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పదవి అప్పగించారన్నారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటించి పార్టీ అభివృద్ధి కోసం ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి కలిసి పని చేసేలా కృషి చేస్తామన్నారు. పార్టీ కార్యాలయంలో ఇచ్చిన శిక్షణ లో అనేక అంశాలు తెలియజేశారని, వాటన్నింటినీ గ్రామస్థాయిలో అమలు పరుస్తూ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.

Updated Date - May 02 , 2026 | 10:59 PM