Share News

‘ ప్రత్యేక’ పాలనపై మల్లగుల్లాలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:57 PM

గ్రామ సర్పంచుల పదవీ కాలం ఈనెల 2 న ముగియడంతో తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం ని యమించింది.

 ‘ ప్రత్యేక’ పాలనపై మల్లగుల్లాలు
ఆలూరు గ్రామ పంచాయతీ కార్యాలయం

ఒక్కో అధికారికి

మూడు పంచాయతీలు కేటాయింపు

గ్రామాభివృద్ధిపై అవగాహన లేని

అధికారులకు బాధ్యతలు

ఆలూరు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): గ్రామ సర్పంచుల పదవీ కాలం ఈనెల 2 న ముగియడంతో తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం ని యమించింది. ఒక్కో మండలస్థాయి అధి కారికి మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించింది. ఇందులో ఎంపీడీవో మొదలుకొని డిప్యూటీ ఎంపీడీవో, తహసీల్దార్‌, మండల విద్యాశాఖ అధికారులు, వ్యవసాయ, పశు సంవర్థక శాఖ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిం చింది.

గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారులకు మాత్రమే అవగాహన ఉంటుంది. వారు గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే కనీసం గ్రామ పంచాయతీల నిర్వహణపై అవగాహన లేని పశుసంవర్థకశాఖ, వ్య వసాయశాఖ, మండల విద్యాశాఖ అధికారులకు సైతం రెండు, మూడు గ్రామాలను కే టాయించారు. సొంత శాఖలోనే బిజీగా ఉండే అధికారులు గ్రామ పంచాయతీల బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. రానున్నది వేసవి కాలం... గ్రామాల్లో తాగునీటి సమస్య పెద్ద గండంగా మారనుంది. అరకొర నిధులు ఉన్న గ్రామ పంచాయతీల నిర్వహణ ప్రత్యేక అధికారులకు సమస్యగానే మారనుంది. ఆలూరు మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో వ్యవసాయ అధికారి వెంకటేశ్వరగౌడ్‌కు మూడు పంచాయతీలు, పశుసంవర్థకశాఖ అధికారి అశోక్‌కి ఒక్క పంచాయతీ, ఎంఈవో-1 కోమలాదేవికి రెండు పంచాయతీలు, ఎంఈవో-2 చిరంజీవిరెడ్డికి రెండు పంచాయతీలు కేటాయించారు. ప్ర భుత్వం అనుకున్న విధంగా త్వరగా స్థానిక ఎన్నికలు జరిగే సరి లేకపోతే ప్రత్యేక అధికారులకు అదనపు బాధ్యతలు తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Apr 07 , 2026 | 11:57 PM