రెచ్చిపోతున్న భూమాఫియా
ABN , Publish Date - May 17 , 2026 | 12:19 AM
పట్టణంలో భూ మాఫియా రోజరోజుకూ రె చ్చిపోతోంది.
మహిళా ఉద్యోగి స్థలం కబ్జా
ఎమ్మెల్యేకు గోడు వెల్లబోసుకున్న బాధితురాలు
ఆదోని, మే 16 (ఆం ధ్రజ్యోతి): పట్టణంలో భూ మాఫియా రోజరోజుకూ రె చ్చిపోతోంది. సామాన్యు ల నే కాదు.. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులను సైతం వీరు వదలటం లేదు. సబ్ క లెక్టర్ కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉ ద్యోగి తిమ్మక్క స్థలాన్నే నకిలీ పత్రాలతో కబ్జా చేశారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే పార్థసారథిని ఆమె కలిసి తన గోడును వెల్లబోసు కుంది. ఈభూకబ్జా వ్యవహారంలో ఒక వ్యవస్థీకృత ముఠా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. విలువైన ఆస్తులపై కన్నేయడం, వాటికి సంబంధించి పాత కాలపు దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం ఈ ముఠా నైజంగా మారింది. బాధితురాలి తెలిపిన వివరాల ప్రకారం ఈ దందా వెనుక ఒక నెట్‌వర్క్ నడుస్తోంది. ఒక డాక్యుమెంట్ రైటర్ నకిలీ పత్రాలు తయారు చేస్తుంటే, ఒక వైద్యుడు (డాక్టర్), స్థానిక బలమైన వ్యక్తులు వెనుక ఉండి బెదిరింపులకు పాల్పడుతు న్నారు. 12 ఏళ్లుగా ఈమహిళా ఉద్యోగిని కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చు ట్టూ తిరు గుతున్నా అక్రమార్కులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవ డం వెనుక గత ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే పార్థసారథి స్పం దించారు. కేవలం ఈఒక్క కేసే కాకుండా ఆదోని నియోజకవర్గంలో జరిగిన ఇలాంటి తప్పుడు రిజిస్ర్టేషన్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఆదోని ప్రజలు ఇకపై ఇలాంటి మో సగాళ్లకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎంతటి వారైనా సరే తప్పుడు పత్రాలు సృష్టిస్తే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు.