Share News

జనసైనికుల శ్రమదానం

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:14 AM

ఇటీవల కురిసిన వర్షానికి మురుగునీరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ ముందు ప్రధాన రహదారిపై నిల్వ ఉంది.

జనసైనికుల శ్రమదానం
నీటిని మోటార్‌ ద్వారా తొలగిస్తున్న జన సైనికులు

ఓబుళదేవరచెరువు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షానికి మురుగునీరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ ముందు ప్రధాన రహదారిపై నిల్వ ఉంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పంచాయతీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో జనసేన మండల ప్రధాన కార్యదర్శి కొండబోయిన సతీష్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డుపై నిల్వ ఉన్న నీటిని మోటార్‌ ద్వారా తొలగించారు. కాని ఇది తాత్కాలికమేనని, ఇక్కడ నీరు నిల్వ ఉండకుండా అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని కొండబోయిన సతీష్‌ కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఆసాధి నాగరాజు, దామోదర్‌, ప్రసాద్‌, అంజన పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:14 AM