Share News

కురువలు సంఘటితం కావాలి

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:15 AM

కురువలు రాజకీయంగా, ఆర్థికంగా సంఘటితం కావాలని కురువ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ దేవేంద్రప్ప అన్నారు.

కురువలు సంఘటితం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న దేవేంద్రప్ప

- సామాజికవర్గ ప్రతినిధుల పిలుపు

ఆదోని, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): కురువలు రాజకీయంగా, ఆర్థికంగా సంఘటితం కావాలని కురువ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ దేవేంద్రప్ప అన్నారు. ఆదివారం పట్టణంలో కురువ, కురుబ సామాజికవర్గాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక భీరలింగేశ్వర కల్యాణ మండపంలో కురువ సంఘం మండల అధ్యక్షుడు చాగి మ ల్లికార్జునరెడ్డి, గోల్డ్‌ రఘు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాసభకు క ర్నూలు జిల్లా నలుమూలల నుంచి కులబాంధవులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.కె.మల్లికార్జున, కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు బత్తిన కుబేర్‌నాథ్‌, మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బత్తిన వెంకటరాముడు వేర్వురుగా మాట్లాడుతూ రాజకీయం, ఆర్థిక రంగాల్లో సామాజికవర్గం ఏకతాటిపై నిలిచి సాధించుకోవాల్సిన హక్కులపై దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో పాటు అన్ని మండలాల్లోనూ నూతన కమిటీలను త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని వెల్లడించారు.2029 ఎన్నికలలో సముచిత స్థానాలను దక్కించుకోవడం లక్ష్యంగా కులస్తులంతా సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, ఆలూరు జయరాముడు, బత్తిన లోకనాథ్‌, రామకృష్ణ, ఉదయ్‌కుమార్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

- నూతన కమిటీ ఎంపిక

ఆదోని నియోజవకవర్గ అధ్యక్షుడిగా కురువ రాఘవేంద్ర, ఆదోని , పెద్దకడబూరు, ఆస్పరి మండలాధ్యక్షులుగా చాగి మల్లికార్జునరెడ్డి, యు.రామలింగ, బత్తిన జీవన్‌కుమార్‌ ఎంపికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు గ్రామ కమిటీల బాధ్యతలను అప్పగించారు.

Updated Date - Jun 08 , 2026 | 12:15 AM