Share News

జీరామ్‌జీ బిల్లును రద్దు చేయాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:08 AM

కేంద్ర ప్రభుత్వం మహా త్మాగాంధీ జాతీ య గ్రా మీణ ఉపాధి హామీ ప థకం స్థానంలో కొత్త గా ప్రవేశపెట్టిన జీ రామ్‌ జీ బిల్లును రద్దు చే యాలని సీపీఐ నాయ కులు ప్రతాప్‌, శివనా రాయణ, అన్వర్‌బాషా, సురేష్‌ కోరారు.

జీరామ్‌జీ బిల్లును రద్దు చేయాలి

ఆత్మకూరు, జన వరి 5(ఆంధ్ర జ్యోతి): కేంద్ర ప్రభుత్వం మహా త్మాగాంధీ జాతీ య గ్రా మీణ ఉపాధి హామీ ప థకం స్థానంలో కొత్త గా ప్రవేశపెట్టిన జీ రామ్‌ జీ బిల్లును రద్దు చే యాలని సీపీఐ నాయ కులు ప్రతాప్‌, శివనా రాయణ, అన్వర్‌బాషా, సురేష్‌ కోరారు. సోమవారం వేల్పనూరు గ్రా మంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిని కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు. సీపీఐ నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. రాష్ట్రాల నిధుల వాటా పెంచడం అన్యాయమన్నారు.

కొత్తపల్లి: జీరామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నక్కస్వాములు, మండల అధ్యక్షుడు న రేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలోని కొకె రంచ గ్రామ సచివాలయంలో జరిగిన గ్రామసభలో సర్పంచ విష్ణువర్ధన రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నాగ రత్నం, దాసు, పగిడ్యాల సురేష్‌, దేవకుమార్‌, గోపాల్‌, పరుశురాం, పక్కీ రయ్య, శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:08 AM