పరిశ్రమను తక్షణమే నిలిపివేయాలి
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:09 PM
మండలంలోని గుట్టపాడు సమీపంలో నెలకొల్పనున్న బల్క్ డ్రగ్స్ పరిశ్రమను తక్షణమే నిలిపివేయాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది.
ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక డిమాండ్
ఓర్వకల్లు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుట్టపాడు సమీపంలో నెలకొల్పనున్న బల్క్ డ్రగ్స్ పరిశ్రమను తక్షణమే నిలిపివేయాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బుధవారం ఓర్వకల్లులోని జీవేశ్వరస్వామి కల్యాణ మండపంలో ప్రాణాంతక పరిశ్రమలతో కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తలుగా జాతీయ అణు ఒప్పంద వ్యతిరేక కార్యవర్గ సభ్యుడు రవీంద్ర శర్మ, ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి, రైతు సంఘం నాయకులు సుధాకర్, రాయలసీమ సాగునీటి సాధన సమితి జిల్లా ఉపాధ్యక్షుడు వాడాల చంద్రశేఖర్‌రెడ్డి, రైతు కూలి సంఘం నాయకులు సుంకన్న హాజరయ్యారు. రవీంద్రశర్మ మాట్లాడుతూ గుట్టపాడు సమీపంలో నెలకొల్పనున్న బల్క్ డ్రగ్స్ పరిశ్రమతో పర్యావరణ సమస్యలు ఎదురవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలను ఉల్లంఘించి గుట్టపాడులో సిగాచి పరిశ్రమకు అనుమతులు మంజూరు చేయడం మంచిది కాదన్నారు. తక్షణమే పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి జోక్యం చేసుకుని అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రత్నం, ఏసేపు, అబ్దుల్ వాహీద్, విజయభాస్కర్, రాధాకృష్ణ, షాజహాన, యోహాన, చంద్రబాబు నాయుడు, వెంకటేశ్వర్లు, నాగన్న, కరీంబాషా పాల్గొన్నారు.