Share News

మహా నేత ఎన్టీఆర్‌

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:21 PM

బీసీ, ఎస్టీ, ఎస్సీల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానేత దివంగత నందమూరి తారక రామారావు అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

   మహా నేత ఎన్టీఆర్‌
ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు

నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు

ఘన నివాళి

నందికొట్కూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): బీసీ, ఎస్టీ, ఎస్సీల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానేత దివంగత నందమూరి తారక రామారావు అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ వ ర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఓ ఫం క్షన హాల్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మె ల్యే జయసూర్య పాల్గొని ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు, అనాథలకు అన్నదానం చేశారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, నాయకులు పలుచాని మహేశ్వర్‌రెడ్డి, మండ్లెం మోహనరెడ్డి, రమే్‌షరెడ్డి, లింగస్వామిగౌడ్‌, కౌన్సిలర్లు జాకీర్‌, ధర్మారెడ్డి, నాయకులు మీనాక్షిదేవి, లక్ష్మీప్రసన్న, డాక్టర్‌ వనజ పాల్గొన్నారు.

తెలుగు ప్రజల హృదయాల్లో..

బండిఆత్మకూరు: తెలుగుజాతి బతుకున్నంత కాలం తెలుగు ప్రజల హృదయాల్లో మరపురాని మహానేత నందమూరి తారకరామారావు అని తెలుగుగంగ జిల్లా వైస్‌ చైర్మన కంచర్ల మనోహర్‌చౌదరి కొనియాడారు. ఎన్టీఆర్‌ 30వ వర్ధంతిని పురస్క రించుకుని పెద్దదేవళాపురం, వెంగళరెడ్డిపేట, నారాయణపురం, బండిఆత్మకూరు, జీసీ పాలెం గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నాయకులు నివాళుల ర్పించారు. నాయకులు సురే్‌షరెడ్డి, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, జాకీర్‌, కృష్ణనాయక్‌, చిన్నలింగారె డ్డి, ఎం.భాస్కర్‌రెడ్డి, బాబు, సద్దాం, మదనభూపాల్‌, శ్రీను, శివయ్య, రామసుబ్బయ్య, చెన్నారెడ్డి, శంకర్‌ పాల్గొన్నారు.

సుపరిపాలనకు అర్ధం చెప్పిన..

మహానంది: సుపరిపాలనకు అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్‌ అని టీడీపీ నాయకులు కొనియాడారు. మహా నంది సమీపంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి వారు పూ లమాల వేసి ని వాళులర్పించా రు. నాయకులు శ్యామల జనార్ధనరెడ్డి, నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి, గడ్డం నాగపుల్ల య్య, వేమూరి కేశవరావు తదిత రులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలకు ఆద్యుడు..

ఆత్మకూరు: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ఆద్యుడు దివంగత నందమూరి తారకరామారావు అని శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన కంచర్ల గో విందరెడ్డి అన్నారు. పట్టణంలోని గౌడ్‌సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ కా ర్యాలయం వద్ద ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో తెలుగు తమ్ముళ్లు రక్తదానం చేశారు. టీడీపీ మండల, పట్టణాధ్యక్షు లు రవీంద్రబాబు, వేణు గోపాల్‌, సింగిల్‌విండో చైర్మన షాబుద్దిన, టీడీపీ మాజీ మండలాధ్యక్షులు శివప్ర సాద్‌రెడ్డి, వీఆర్‌ఎస్పీ ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

బలహీనవర్గాల ఆశాజ్యోతి..

పాములపాడు: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత డాక్టర్‌ నం దమూరి తారక రామరావు అని టీడీపీ నాయకులు అన్నారు. మండలంలోని వేంపెంటలో ఆదివారం ఎన్టీఆర్‌ చిత్ర పటానికి టీడీపీ నాయకు లు లక్ష్మికాంతరెడ్డి, మో హనగౌడ్‌, లెనినబాబు, బాల స్వామి, ఆదిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోవిందు, తి మ్మారెడ్డి, జనార్ధనరెడ్డి, బండ్లమూరి వెంకటేశ్వరరావు, రామలింగేశ్వరరెడ్డి, ఏసేపు, అలీబాష పాల్గొన్నారు.

ప్రపంచ నలుమూలలకు..

గడివేముల / వెలుగోడు : తెలుగు ప్రజల ఔనత్యాన్ని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మహా నాయకుడు ఎన్టీఆర్‌ అని టీడీపీ మండల అధ్యక్షుడు దిలి్‌పకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సీతారామిరెడ్డి, సొసైటీ చైర్మన సత్యనారాయణరెడ్డి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు ఈశ్వర్‌రెడ్డి, వడ్డు లక్ష్మీదేవి, రమణారెడ్డి, నారాయణరెడ్డి, మాజీ సర్పంచ జమాల్‌బాష, రమణయ్య పాల్గొన్నారు. వెలుగోడులోని తె లుగుగంగ జలాశయం వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రాహానికి పూల మాలలు వేసి ని వాళులర్పించారు. చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్దాశ్రమంలో వృద్దులకు టీడీపీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు మొమిన రసూ ల్‌, హిదాయత, అబ్దుల్‌కలాం, హంజా, విజయబాస్కర్‌, వరలక్ష్మి, శ్రీనివాసగౌడ్‌, శంకరరెడ్డి, రజి, ఇంతియాజ్‌, సర్పరాజ్‌ పలువురు నాయకులు పాల్గొన్నారు.

రోగులకు పండ్లు పంపిణీ

మిడుతూరు/ పాణ్యం: మిడుతూరు ప్రభుత్వ వైద్యశాలలో ఎన్టీర్‌ సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైద్యశాలలో వైద్యు లు ప్రజ్వల ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ చేశారు. వెంకటేష్‌ అను వ్యక్తి గత 9 ఏళ్ల నుంచి కంటి చూపు కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడని సేవా సమితి ఆధ్వర్యంలో బా ధిత కుటుంబానికి రూ.20వే లు ఆర్థికసాయం అందించారు. ఎన్టీర్‌ సేవా సమితి సభ్యులు బాష, బుజ్జి, మధు, అబ్బాస్‌, ఇమ్రాన్‌ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పాణ్యం టీడీపీ మండల కన్వీనర్‌ గణపం జయరామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. సర్పంచ బాలయ్య, మనోహర్‌, ఎంపీటీసీలు రంగరమేష్‌, భాస్కరరెడ్డి, మార్కెట్‌యార్డు కమిటీ ఉపాధ్యక్షులు గోవర్థనరెడ్డి, మాజీ సర్పంచ గంగనారా యణ, మాజీ ఎంపీటీసీలు తి రుపాలు, వెంకటరమణ పాల్గొన్నారు.

బీరవోలులో ఎన్టీఆర్‌కు..

పగిడ్యాల: నటసార్వభౌముడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ వర్ధంతిని మండల పరిధిలోని బీరవోలు గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ, టీడీపీ నియోజకవర్గ మాజీ ఇనచార్జి చిమ్మె బిచ్చన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్బంగా ఎన్టీఆర్‌ చిత్రపట్టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు జయరాగవ నాయుడు, శ్రీనివాసులు, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 11:21 PM