Share News

అంగరంగ వైభవం రంగనాథస్వామి రథోత్సవం

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:33 AM

సంతానవరదుడు శ్రీపులికొండ రంగనాథస్వామి రథోత్సవం మంగళవారం అశేషజనవాహిని భక్తిపారవశ్యం నడుమ వైభవంగా సాగింది.

అంగరంగ వైభవం రంగనాథస్వామి రథోత్సవం
అశేష జనవాహిని నడుమ సాగుతున్న రథోత్సవం

పత్తికొండ, ఫిబ్రవరి 24 (ఆంఽధ్రజ్యోతి): సంతానవరదుడు శ్రీపులికొండ రంగనాథస్వామి రథోత్సవం మంగళవారం అశేషజనవాహిని భక్తిపారవశ్యం నడుమ వైభవంగా సాగింది. కార్యక్రమాలలో భాగంగా ఉదయం ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం రథాంగహోమం సాయంత్రం పల్లకీలో స్వామివార్ల ఊరేగింపు రథం వరకు సాగింది. సాయంత్రం ఉత్సవమూర్తులు కొలువుతీరగ రథోత్సవం నిర్వహించారు. టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, యువనాయకుడు కేఈ రుద్ర, మాజీమార్కెట్‌ యార్డు చైర్మన ప్రమోద్‌కుమార్‌రెడ్డి, బీసీ సెల్‌రాష్ట్రనాయకులు రామానాయుడు, స్థానికనాయకులు చంద్ర, ఈవో వీరయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:33 AM