వైభవంగా ముత్యాలమ్మ జాతర
ABN , Publish Date - Apr 16 , 2026 | 01:29 AM
ముత్యాలమ్మ జాతర బుధవారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
సతకంపట్టు వద్ద అమ్మవారి పాదాలు ప్రతిష్ఠ
చింతపల్లి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ముత్యాలమ్మ జాతర బుధవారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుర్లవారి స్థావరాల్లో అమ్మవారి పాదాలకు అర్చకులు సుర్ల అప్పారావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి పాదాలను చింతపల్లి, జీకేవీధి ఎంపీపీ కోరాబు అనూషదేవి, బోయిన కుమారి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పసుపులేటి వినాయకరావు, ప్రధాన కార్యదర్శి పోతురాజు బాలయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదిరెడ్ల బేతాళుడు, ఎంపీడీవో సీహెచ్ సీతామహాలక్ష్మి, తహశీల్దార్ కె.శంకరరావు మోసుకుంటూ సతకంపట్టు వద్దకు తీసుకొచ్చి ప్రతిష్టించారు. గురువారం అమ్మవారి పాదాలను పంచాయతీ పురవీధుల్లో ఊరేగించి సుర్లవారి స్థావరాలకు తీసుకొస్తారు. శుక్రవారం అమ్మవారికి అనుపోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గంజారి రమణ, తాడి రమణ, సుర్ల వీరేంద్ర, తాటిపాకల రమేశ్, నాగేశ్వరరావు, గాజుల శ్రీనివాసరావు, పైలా శ్రీను, నూరు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.