Share News

వక్ఫ్‌ భూములను కాపాడటం ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - May 10 , 2026 | 11:47 PM

వక్ఫ్‌ భూములను కాపాడడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

   వక్ఫ్‌ భూములను కాపాడటం ప్రభుత్వ ధ్యేయం
మంత్రికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఫరూక్‌ షిబ్లీ

రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్‌

నంద్యాల రూరల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి) : వక్ఫ్‌ భూములను కాపాడడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో జమాతే అహలే సున్నత ప్రతినిధులు, ఉర్దూ అకాడమీ చైర్మెన ఫరూక్‌ షిబ్లీ, కర్నూల్‌ మాజీ ఎమ్యెల్యే గపూర్‌ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూల్‌ ఈద్గాకు సంబంధించిన 3 ఎకరాల భూమిని కొందరు అక్రమించాలని ఛూశారన్నారు. ఈక్రమంలోనే మంత్రి ఫరూక్‌ ప్రత్యేక శ్రద్ధతో వక్ఫ్‌బోర్డు సహకారంతో సుప్రీం కోర్టులో సీనియర్‌ న్యాయవాదులను నియమించి 3 ఎకరాల భూమి తో పాటు మరో 300 ఎకరాలు కూడా వక్ఫ్‌ బోర్డుకు చెందినవిగా నిరూపించారన్నారు. ఆ విజయంలో కీలకపాత్ర పోషించిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ వక్ఫ్‌ భూములను ఎవరు ఆక్రమించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భూమిని ముస్లీం, మైనార్టీ సంక్షేమ, మతపరమైన కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు.

Updated Date - May 10 , 2026 | 11:47 PM