ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:09 AM
ప్ర జల నుంచి వచ్చే వినతులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి పారదర్శకత పరి ష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆదోని ఆర్డీవో కె. అరుణదేవి అన్నారు.
- ఆదోని ఆర్డీవో కె. అరుణాదేవి
- ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
ఆదోని, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్ర జల నుంచి వచ్చే వినతులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి పారదర్శకత పరి ష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆదోని ఆర్డీవో కె. అరుణదేవి అన్నారు. సోమవారం ఆదోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజల నుంచి ఆర్డీవో నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రతి అర్జీ వెనుక ఒక కుటుంబం ఆశలు, ఆవేదన, అవసరాలు ఉంటాయని అధికారులు గుర్తించాలన్నారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధశాఖల జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.